News September 12, 2025

HYD: కరెంట్ ఎప్పుడు విశ్రాంతి తీసుకోదు: MD

image

HYD వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. HYDలో కరెంట్ ఎప్పుడు విశ్రాంతి తీసుకోదని తెలియజేస్తూ.. POWER NEVER TAKES BREAK అని Xలో రాసుకోచ్చారు. వినియోగదారులందరికి అత్యుత్తమ నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం యంత్రాంగం కృషి చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News September 12, 2025

తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టుబడిన హుండీ దొంగ

image

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన రూ.4,000 నగదును దొంగిలించాడు. ఈ ఘటనను కమాండ్ & కంట్రోల్ సెంటర్‌లో సీసీటీవీలో గమనించిన అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

News September 12, 2025

ఆత్మకూరు- వనపర్తి రాకపోకలు బంద్

image

ఆత్మకూరు-వనపర్తి మధ్య రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. మదనాపురం దగ్గర ఉన్న ఊకచెట్టు వాగు కాజువేపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి వనపర్తి, కొత్తకోటకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పారు.

News September 12, 2025

ఊట్కూర్: తల్లీకూతురు అదృశ్యం.. మిస్సింగ్ కేసు

image

తల్లి, కుమార్తె అదృశ్యమైన ఘటన ఊట్కూరు మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలమ్మ (24) తన కూతురు స్వాతి (4)తో కలిసి గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలమ్మ తల్లి మణెమ్మ ఇటీవల అదృశ్యమై HYDలో దారుణ హత్యకు గురైంది. మనస్తాపంతో బాలమ్మ తన కూతురితో అదృశ్యమైనట్లు భావిస్తున్నారు.