News September 12, 2025
జనగామ: భూ భారతి దరఖాస్తులను వేగవంతం చేయాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన భూ భారతి, సాదా బైనామ, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ఎమ్మార్వోల సందేహాలను నివృత్తి చేస్తూ, వేగవంతమైన పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News March 17, 2026
అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మంగళవారం ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. శాఖల వారీగా సంబంధిత పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. నీటి వనరుల సమర్థ వినియోగం, సాగునీటి సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. నేషనల్ హైవేస్, ఎనర్జీ శాఖల పనులను సమీక్షించారు.
News March 17, 2026
సూర్యాపేట: కార్యాలయ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణ, క్రమశిక్షణ పక్కాగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి సమయపాలన పాటించాలని, ‘ఫేస్ అటెండెన్స్’ యాప్‌లో హాజరు నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లు, ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు.
News March 17, 2026
‘ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం’.. అమెరికా ఉన్నతాధికారి రాజీనామా

ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్.. ట్రంప్‌కు షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. మన దేశానికి ఇప్పటికిప్పుడు ఇరాన్‌తో ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్, బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది’ అని పేర్కొన్నారు.


