News September 12, 2025
HNK: కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయపాలన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
Similar News
News September 12, 2025
జగదేవ్పూర్: భర్తపై ప్రియుడితో కలిసి దాడి.. ఇద్దరి అరెస్ట్

అక్రమ సంబంధం కారణంగా ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చాలనుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన ఓ వ్యక్తితో మమతకు వివాహమైంది. అనంతరం ఆదే గ్రామానికి చెందిన వడ్డే బాబుతో వివాహేతర బంధం ఏర్పడింది. వారికి భర్త అడ్డు వస్తున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాబు, మమతను గురువారం అరెస్ట్ చేశారు.
News September 12, 2025
శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
News September 12, 2025
RMPT: చికిత్స పొందుతూ యువకుడి మృతి

15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. తొనిగండ్ల గ్రామానికి చెందిన మంగలి అనిల్ అనే వ్యక్తి జాన్సీ లింగాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద 15 రోజుల క్రితం షాక్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.