News September 12, 2025

సంగారెడ్డి: ఉన్నత చదువులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు అనుమతినిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో 19 మంది ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివేందుకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

RMPT: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. తొనిగండ్ల గ్రామానికి చెందిన మంగలి అనిల్ అనే వ్యక్తి జాన్సీ లింగాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద 15 రోజుల క్రితం షాక్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 12, 2025

మండల స్థాయి స్కూల్ గేమ్స్‌కు సన్నద్ధం కావాలి: డీఈవో

image

త్వరలో నిర్వహించనున్న మండల స్థాయి స్కూల్ గేమ్స్ కు సన్నద్ధం కావాలని అనకాపల్లి డీఈవో అప్పారావు నాయుడు సూచించారు. కశింకోట జడ్పీ హైస్కూల్లో గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ నిర్వహణకు పీడీలు, హెచ్ఎంలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర ఏడు గేమ్స్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు.

News September 12, 2025

వరంగల్: గ్రామాల్లో బొడ్డెమ్మ పండగ ప్రారంభం..!

image

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బొడ్డెమ్మ పండగ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. బొడ్డెమ్మను పుట్ట మట్టితో అందంగా పేర్చి చెక్క పీటపై కలశం పెట్టీ పసుపు గౌరమ్మను ఉంచుతారు. ఇలా రోజు కాలనీలో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో బొడ్డెమ్మను ఆడుతారు. అమావాస్య ముందు రోజు చెరువులో స్థానిక కుంటల్లో బావుల్లో నిమజ్జనం చేస్తారు. మరుసటి రోజు నుంచే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.