News September 12, 2025
ADB: కూలిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కూలిన పురాతన భవనాన్ని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. తహసిల్దార్ శ్రీనివాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వారు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని వారు చెప్పారు.
Similar News
News March 9, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News March 9, 2026
ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.
News March 9, 2026
ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.


