News September 12, 2025

నస్రుల్లాబాద్: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఎస్సై రాఘవేంద్ర, తన సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి వారి వద్ద నుంచి 3 మొబైల్స్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 12, 2025

HYD: వీధిలో చెత్త వేస్తున్నారా..? ALERT

image

HYD వీధులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంతో తలెత్తే సమస్యలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రెండు రోడ్లు, ప్రార్థన స్థలాలు ఉన్నచోట్ల ఈ చర్యలు చేపడుతున్నారు. చెత్త వేస్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ విధానం ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో అమలు చేస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.

News September 12, 2025

కలసపాడు: 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

image

కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

News September 12, 2025

సీఎం చంద్రబాబు ఇవాళ్టి షెడ్యూల్

image

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ ఉ.9.30 గంటలకు జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఉ.11.55 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరుతారు.
* మ.2.45 గంటలకు మంగళగిరిలోని CK కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.
* మ.3.00 గంటలకు Way2News కాన్‌క్లేవ్‌లో పాల్గొంటారు.
* సాయంత్రం 4.15 గంటలకు నివాసానికి చేరుకుంటారు.