News September 12, 2025
ఒక తప్పిదం క్షణాల్లో జీవితాన్ని నాశనం చేస్తుంది: SP

కామారెడ్డి టౌన్ PS పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 61 మందిపై కేసులు నమోదు చేసి, వారికి కోర్టు మొత్తం రూ.56 వేల జరిమానా విధించింది. SP రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఒక చిన్న తప్పిదం కూడా క్షణాల్లో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.
News March 9, 2026
వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.
News March 9, 2026
కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.


