News September 12, 2025

సంగారెడ్డి: నేడు జాబ్ మేళా

image

సంగారెడ్డిలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 12న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ గురువారం తెలిపారు. ఫార్మసీలో ఫార్మసిస్ట్, అన్నపూర్ణ ఫైనాన్స్‌లో ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. పదో తరగతి, బీ ఫార్మసీ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

కర్నూలు: ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్‌ను మోసం చేసిన ఘనుడు

image

ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన ట్రాన్స్‌జెండర్ గీతను, చిన్నటేకూరుకు చెందిన పరశురాం ప్రేమ పేరుతో వంచించినట్లు బాధితురాలు ఆరోపించింది. 2024 నుంచి పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు డబ్బు అడిగితే అసభ్యకరంగా దూషిస్తూ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని గీత పోలీసులను ఆశ్రయించింది.

News March 15, 2026

నంద్యాల జిల్లాలో విజయవంతంగా ‘అక్షరాంధ్ర’ పరీక్షలు

image

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో 1,024 పరీక్షా కేంద్రాలలో 1,00,993 మంది పరీక్షలు రాసినట్లు వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. “అక్షరాంధ్ర” ఫైనల్ పరీక్ష విజయవంతంగా జరిగిందన్నారు. లక్ష మందికి పైగా హాజరవడం అభ్యాసకులలో ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. అక్షరాస్యత శాతం పెంపుకు ప్రతిబింబమని, అందరి సహకారంతో విజయవంతంగా జరిగిందన్నారు.

News March 15, 2026

బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

image

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.