News September 12, 2025
భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవిని గొడ్డలితో హత్య చేసిన రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అతడిని కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో జైలుకు తరలించినట్టు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Similar News
News September 12, 2025
MDK: గురు’కూలే’ భవనాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైనా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. SRD జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం రెండు రోజుల కిందట కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. SDPT లో మైనార్టీ గురుకుల పాఠశాల అధ్వానంగా ఉంది. MDK రామాయంపేట ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది.
News September 12, 2025
47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

రాంచీలోని MECON లిమిటెడ్‌లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <
News September 12, 2025
కూకట్‌పల్లి: రేణు హత్య కేసులో పురోగతి

కూకట్‌పల్లిలో వ్యాపారి భార్య రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం నిందితుల కోసం ఝార్ఖండ్‌కు వెళ్లింది. కాగా, నిందితులు హర్ష, రోషన్.. రేణు హత్య అనంతరం వాడిన స్కూటీని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.