News September 12, 2025

నగరి: రోజా కుమార్తెకు యూనివర్సిటీ అవార్డు

image

అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ కోర్సు చదువుతున్న మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షుమాలికకు మౌరీన్ బిగ్గర్స్ అవార్డు లభించింది. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌరీన్ బిగ్గర్స్ అందించిన సేవలను గౌరవించేందుకు 2023 నుంచి యూనివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. సాంకేతికతలో సమానత్వం దిశగా కృషి చేసే విద్యార్థులకు ఈ అవార్డును అందజేస్తారు.

Similar News

News March 10, 2026

తిరుపతి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష.!

image

ప్రేమ పేరుతో బాలిక(15)ను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డ చిల్లకూరు(M)పల్లిపేడుకు చెందిన నవీన్‌కు తెలంగాణ రాష్ట్రం హనుమకొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నవీన్ బతువుదెరువు కోసం తెలంగాణకు వలస వెళ్లాడు. అక్కడ 2020లో బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడికి శిక్షతోపాటు ₹14,000 జరిమానా విధించింది.

News March 10, 2026

VKB జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్..89% పూర్తి

image

వికారాబాద్ జిల్లాలో రైతు నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 1,62,534 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 89 శాతం నమోదు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగతా రైతులు కూడా త్వరగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. నమోదు పూర్తి అయిన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

News March 10, 2026

వార్ విజువల్స్ షేర్ చేస్తే జైలుకే!

image

సౌదీలో ఎయిర్ కండీషనర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏపీలోని మదనపల్లెకు చెందిన యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికార యుద్ధ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. అటు ఖతర్‌లోనూ యుద్ధానికి సంబంధించిన వీడియోలు తీశారని, అనధికార సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారని 313 మందిని అరెస్ట్ చేశారు. UAEలోనూ వార్ విజువల్స్ రికార్డు/షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. 1-2 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.