News September 12, 2025
KMR: ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

ప్రేమలో మోసపోయానని మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సబ్దల్ పూర్‌లో బుధవారం జరిగింది. ఎస్సై బొజ్జ మహేష్ వివరాలిలు.. గ్రామానికి చెందిన సావిత్రి(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ప్రదీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 10, 2026
నెల్లూరు: మహిళ దారుణ హత్య

నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట(M) ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించేవారని గుర్తించారు.
News March 10, 2026
భారత్‌లో 53% పెరిగిన ఐఫోన్ల తయారీ

భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ భారీగా పెరిగింది. గత ఏడాది ఇక్కడ 55 మిలియన్ ఐఫోన్లు తయారైనట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది 36 మిలియన్ ఐఫోన్లు తయారు కాగా 2025లో ఇది 53% పెరిగింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 220-230 మిలియన్ ఐఫోన్లు తయారు అవుతుండగా.. అందులో భారత్ వాటా ఇప్పుడు 25%కు చేరింది. US-చైనా ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో యాపిల్ ఇండియాలో తమ ఉత్పత్తులను పెంచుతున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2026
SVU : కాన్వకేషన్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 63-68 వార్షిక కాన్వకేషన్ దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ప్రకటనలో పేర్కొన్నారు. 2025 విద్యా సంవత్సరంలోపు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పిహెచ్ డీ పూర్తిచేసిన అభ్యర్థులు మార్చి 23వ తేదీ కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


