News September 12, 2025
మదనపల్లె: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు

ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె రెండవ అదనపు జ్యుడీసియల్ కోర్టు జడ్జి గురువారం తీర్పు ఇచ్చినట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో రెండు ఇళ్లల్లో దొంగతనం చేసిన కేసులో చీకిలగుట్టలో ఉండే కావడి సోమశేఖర్‌ను అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరిగి, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది.
Similar News
News March 16, 2026
చంద్రబాబు, లోకేశ్ తప్పకుండా అనుభవిస్తారు: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని MLA పెద్దిరెడ్డి అన్నారు. నెల్లూరు జైలులో పిన్నెల్లిని ఇవాళ MP మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ‘YCP నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. హత్య కేసులో అసలైన నేరస్థులను వదిలి పిన్నెల్లిపై అక్రమ కేసు మోపారు. దీనికి ప్రతిఫలం CBN, లోకేశ్ అనుభవిస్తారు’ అని పెద్దిరెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదని YCP హయాంలో ఇలాంటి చర్యలే రిపీట్ అయితే సహించగలరా అని MP ప్రశ్నించారు.
News March 16, 2026
దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన రత్నాగారి లత కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో సుమారు 7.1 కిలోల బరువున్న మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
News March 16, 2026
ఆస్తి పన్ను బకాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS) ద్వారా బకాయిలపై 90% వడ్డీ మాఫీని పొందే సువర్ణ అవకాశం ఇది. ఇప్పటివరకు GHMC, CMC, MMC పరిధిలో 2.67 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుని, రూ. 52.08 కోట్ల వడ్డీని ఆదా చేసుకున్నారు. ఇప్పటికే 1.64 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. జప్తు వారెంట్ల వంటి కఠిన చర్యలకు గురికాకుండా, వెంటనే మీ పన్ను బకాయిలను చెల్లించి భారీగా ఆదా చేసుకోండి!


