News September 12, 2025
SRPT: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ గురువారం కోరారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్నీ కేసుల్లో కక్షిదారులు రాజీ పడవచ్చన్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమన్నారు. ఇందుకు లోక్ అదాలత్ ఓ మంచి వేదికన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News September 12, 2025
మా హయాంలో పరిశ్రమలు వెళ్లిపోలేదు: సజ్జల

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారంగా Way2News కాన్‌క్లేవ్‌లో కొట్టిపారేశారు. లులూ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపించాయని చెప్పడంతో అదేమైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీయా అని ప్రశ్నించారు. కొవిడ్ రాకపోయుంటే తాము మరింత మెరుగ్గా పనిచేసేవాళ్లమని, మరింత ఆర్థిక వృద్ధి సాధించేవాళ్లమని చెప్పారు.
News September 12, 2025
KNR: ఆగిన నిధులు.. పారిశుద్ధ్యం వెతలు..!

కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1216 గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, విద్యుద్దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపాలిటీలు, పల్లెల్లో ఫాగింగ్ మెషీన్లున్నా నిరుపయోగంగా మారాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News September 12, 2025
విశాఖలో ఈ-గవర్నెన్స్‌పై జాతీయ సదస్సు: కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23వ తేదీల్లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు జరగనుంది. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట రెండు రోజుల నోవాటెల్ హాటళ్లో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి 1000 మంది అతిథులు, ఏపీ సీఎం, కేంద్ర, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం ఆదేశించారు.