News September 12, 2025

పాడేరు: ‘మధ్యాహ్నం 3:30 గంటల వరకే ఈ సేవలు’

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఇవాళ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.

Similar News

News March 18, 2026

గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందించే పథకాల ఆర్థిక సహాయంతో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణం, యూనిఫైడ్ సర్వే, ఆస్తి పన్ను వసూళ్లపై సమీక్షించారు. లబ్ధిదారులు అందుబాటులో ఉన్న సహాయాన్ని వినియోగించుకోవాలన్నారు. అధికారులు పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 18, 2026

TODAY HEADLINES

image

☛ రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG: CM CBN
☛ చంద్రబాబు తీరువల్లనే డ్రగ్స్ దందాలు: జగన్
☛ మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన TG ప్రభుత్వం
☛ KCR కూడా డ్రగ్ టెస్ట్‌కు రావాలి: TPCC చీఫ్
☛ ఆరు గ్యారంటీల ఫైల్ ఎక్కడ? కాకి ఎత్తుకెళ్లిందా?: KTR
☛ ఇంకా ఆందోళనకరంగానే గ్యాస్ నిల్వలు: కేంద్రం
☛ అఫ్గాన్‌పై పాక్ దాడులు.. ఖండించిన భారత్

News March 18, 2026

హాస్టల్స్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం
మచిలీపట్నం కలెక్టరేట్‌లో హాస్టళ్ల సంయుక్త తనిఖీ కమిటీ సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర సమస్యలపై సమీక్షించారు. వసతి గృహాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.