News April 4, 2024
కర్నూలు: కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అనంత(D) గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.
Similar News
News March 10, 2026
కర్నూలు: రూ.14,740 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

KNL కలెక్టరేట్‌లో నాబార్డు రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసి నూరుల్ ఖమర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాలన్నరు. మొత్తం రుణ అంచనా రూ.14,740 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,283 కోట్లు, విద్యా రుణాలు రూ.203 కోట్లు, MSME 3,653 కోట్లు, గృహ రుణాలు రూ.287 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది.
News March 10, 2026
కర్నూలు నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ సిరి

కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News March 10, 2026
ఇంటర్ పరీక్షలకు 526 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 526 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 20,731 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 20,205 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.


