News September 12, 2025
ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
విశాఖలో నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల నియామకం

విశాఖలోని అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా పలువురుని వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం నియమించింది.
➤ విశాఖ నార్త్: చింతకాయల సన్యాసి పాత్రుడు
➤ విశాఖ సౌత్: వీసం రామకృష్ణ
➤ విశాఖ వెస్ట్: జాహీర్ అహ్మద్
➤ విశాఖ ఈస్ట్: పేడాడ రమణి కుమారి
➤ గాజువాక: పసుపులేటి బాలరాజు
➤ భీమిలి: తైనాలా విజయ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
News March 14, 2026
భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.
News March 14, 2026
విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


