News September 12, 2025
తిరుపతి: ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ బయో ఫెర్టిలైజర్స్- ప్రొడక్షన్& మేనేజ్మెంట్, తేనెటీగల పెంపకం విభాగాలలో తెలుగు మీడియంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://angrau.ac.in/ వెబ్ సైట్ ను చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్18.
Similar News
News March 5, 2026
PDPL: జిల్లా వ్యాప్తంగా ‘సైబర్ జాగృతి దివాస్’

‘సైబర్ జాగృతి దివాస్’ సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘సైబర్ మోసాలకు చెక్- అప్రమత్తతే రక్షణ’ పై ప్రజలకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరికి తెలియపరచవద్దని, ఆన్ లైన్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధానంగా బ్యాంకు సంబంధించిన వివరాలు ఎవరికీ ఇవ్వవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి పోలీస్ సహాయం పొందాలన్నారు.
News March 5, 2026
నేషనల్ సేఫ్టీ వీక్.. జగిత్యాల డిపోలో అవగాహన

నేషనల్ సేఫ్టీ వీక్ సందర్భంగా బుధవారం జగిత్యాల ఆర్టీసీ డిపో ఆవరణలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో ఫైర్ ఎక్విప్‌మెంట్‌ను ఎలా ఉపయోగించాలి, అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై డిపో ఉద్యోగులకు ప్రదర్శనతో మెలకువలు నేర్పించారు. అగ్నిమాపక శాఖ ఎల్‌పీఎఫ్ ఫిట్టర్ జి.మధు టీమ్ లీడర్‌గా పాల్గొన్నారు. డిపో మేనేజర్ కె.కల్పన తదితరులు ఉన్నారు.
News March 5, 2026
ధర్మపురి: పెళ్లి నిరాకరణతో బాలిక ఆత్మహత్య.. కేసు నమోదు

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ధర్మపురి ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేశారు. ‘మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక జగిత్యాలలోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. జగిత్యాలకు చెందిన కోలా మనోజ్(22) ప్రేమ పేరుతో వేధిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత పెళ్లికి నిరాకరించడంతో బాలిక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది’ అని ఎస్‌ఐ పేర్కొన్నారు.


