News April 4, 2024

తిరుమల: రేపు డయల్ యువర్ ఈవో

image

టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 10, 2026

చిత్తూరు: ఏడుగురు సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు

image

ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ జిల్లా సర్వే భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య ఉత్తర్వులు జారీచేశారు. తోటి సర్వేయర్లను విధులకు హాజరు కానీయకుండా చేశారనే కారణంతో సర్వేయర్ల యూనియన్ ఆఫీస్ బేరర్స్‌లోని నాయకులకు షోకాజ్ ఇచ్చారు. ఇదే వ్యవహారంలో గతంలో ముగ్గురు సర్వేయర్లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

News March 10, 2026

రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్

image

కుప్పం రెస్కో పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేస్తున్నట్లు రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. మార్చి 10 నుంచి 25 వరకు వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయడం జరుగుతుందని, రెస్కో పరిధిలో గృహ వినియోగదారులు 31.01.2026 వరకు పాత బకాయిలు ఉంటే పూర్తిగా వడ్డీ మాఫీ (సర్ చార్జ్) తో బిల్లులు చెల్లించవచ్చన్నారు. రెస్కో పరిధిలోని గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.