News September 12, 2025
చింతపల్లి: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్

ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 15న స్పాట్ కౌన్సెలింగ్ జరగనుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, చేయించుకోని విద్యార్థులు సైతం గుంటూరు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు.
Similar News
News September 12, 2025
వనపర్తి: జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాలలో శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 133.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింద. గోపాల్‌పేట 101.0 మి.మీ, పెద్దమందడి 98.0 మి.మీ, గణపూర్ 97.0 మి.మీ, వనపర్తి 74.0 మి.మీ, ఏదుల, పెబ్బేరులో 65.0 మి.మీ, పానగల్ 61.0 మి.మీ, కొత్తకోట 53.0 మి.మీ, మదనాపురం 43.0 మి.మీ, వీపనగండ్ల 38.0 మి.మీ, చిన్నంబావి 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News September 12, 2025
తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.
News September 12, 2025
మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.