News September 12, 2025
HYD: BRO ట్రాఫిక్ ఉల్లంఘిస్తే మెసేజ్ చేయండి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపై సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినా.. 9490617346కు వాట్సప్ ద్వారా లొకేషన్, డిటైల్స్ ఎంటర్ చేసి, ఫొటోతో పంపాలన్నారు. ఓ వ్యక్తి ఇటీవల హెల్మెట్ ధరించకపోవడంపై అధికారులు స్పందించారు.
Similar News
News March 17, 2026
వికారాబాద్‌లో వరుస సెలవులు!

వికారాబాద్‌లో ఒక్కపూట బడులు ప్రారంభం కావడంతో పాటు మార్చి నెలలో పండుగల సెలవులు కలిసొస్తున్నాయి. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస విరామం దొరకనుంది. దీంతో అటు పండుగలు, ఇటు పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు నిమగ్నమయ్యారు.
News March 17, 2026
రాజమండ్రి: మార్చి 19న ఉగాది పురస్కారాలు

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను గౌరవించేందుకు మార్చి 19న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం’ నిర్వహించనున్నట్లు MP పురందీశ్వరి మంగళవారం తెలిపారు. నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద ఈ వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సముచిత రీతిలో సన్మానిస్తామని వెల్లడించారు.
News March 17, 2026
అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.


