News September 12, 2025
చీరాల: ‘హత్య చేశానంటూ లొంగిపోయాడు’

చీరాలలోని హారిస్ పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు మృతి మిస్టరీ వీడింది. ఈ నెల 3న కోటేశ్వరరావు తన ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనివార్య కారణాలవల్ల తానే కోటేశ్వరరావును హత్య చేశానంటూ నిందితుడు విజయ్ బాబు చీరాల టూ టౌన్ CI నాగభూషణం, SI వెంకటేశ్వర్లు ఎదుట గురువారం లొంగిపోయాడు. దీంతో చట్ట ప్రకారం విజయ్ బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
Similar News
News September 12, 2025
విజయదశమి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

విజయదశమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గొడవలకు తావులేకుండా పండుగ జరపడంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
News September 12, 2025
వనపర్తి: జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాలలో శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 133.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింద. గోపాల్‌పేట 101.0 మి.మీ, పెద్దమందడి 98.0 మి.మీ, గణపూర్ 97.0 మి.మీ, వనపర్తి 74.0 మి.మీ, ఏదుల, పెబ్బేరులో 65.0 మి.మీ, పానగల్ 61.0 మి.మీ, కొత్తకోట 53.0 మి.మీ, మదనాపురం 43.0 మి.మీ, వీపనగండ్ల 38.0 మి.మీ, చిన్నంబావి 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News September 12, 2025
తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.