News September 12, 2025
MBNR: ఈజీ మనీ కోసం దొంగలుగా మారి

హైదరాబాద్‌లో క్యాటరింగ్‌లు చేసుకునే ఓ నలుగురు ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టారు. ఒక ముఠాగా మారి ఆవులను అపహరించి సంతల్లో అమ్మేవారు. MBNR ఎస్పీ జానకీ వివరాలు.. HYDలో <<17677272>>క్యాటరింగ్<<>>లో కుమ్మరి ఆశోక్, అఖిల్, సాయికుమార్, బుర్కసాయి ఈ నలుగురికి పరిచయాలు ఏర్పడ్డాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో రాత్రి వేళల్లో పశువుల చోరీలు ప్రారంభించారు. ఈ ముఠా ఇప్పటికీ రూ.14.50 లక్షల విలువైన పశువులు చోరీ చేశారు.
Similar News
News March 4, 2026
వార్ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈనెల 19న రావాల్సిన ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపింది.
News March 4, 2026
NLG: అంగన్వాడీలకు ఇక వెలుగులు

జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
News March 4, 2026
తిరుపతి: రోడ్ల అభివృద్ధికి రూ. 24.24 కోట్లు

రోడ్ల అభివృద్ధిపై ఆర్ అండ్ బీ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరులోని నియోజకవర్గాల పరిధిలో మొత్తం 136.19 కిలో మీటర్ల మేర రోడ్లు మరమ్మత్తులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ.24.24 కోట్లు నిధులు మంజూరైంది. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.


