News September 12, 2025

ఊట్కూర్: తల్లీకూతురు అదృశ్యం.. మిస్సింగ్ కేసు

image

తల్లి, కుమార్తె అదృశ్యమైన ఘటన ఊట్కూరు మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలమ్మ (24) తన కూతురు స్వాతి (4)తో కలిసి గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలమ్మ తల్లి మణెమ్మ ఇటీవల అదృశ్యమై HYDలో దారుణ హత్యకు గురైంది. మనస్తాపంతో బాలమ్మ తన కూతురితో అదృశ్యమైనట్లు భావిస్తున్నారు.

Similar News

News March 9, 2026

వార్ ఎఫెక్ట్: భారీగా పడిపోతున్న గుడ్లు, అరటి రేట్లు

image

AP: ఇరాన్ వార్ ఎఫెక్టుతో రాష్ట్ర ఎగుమతుల రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గల్ఫ్ దేశాలకు గుడ్లు, రొయ్యలు వంటి ఎగుమతుల్లో 54% వాటా AP, TN, TGలవే. ఇందులో AP వాటానే 20%. అలాగే రాయలసీమ నుంచి అరటి గల్ఫ్‌కు వెళ్తుంటుంది. ఎగుమతులు నిలిచి స్థానికంగా గుడ్డు ధర ₹3కి, అరటి KG ₹10కి పడిపోయాయి. రొయ్యదీ అదే స్థితి. అటు 40% నాన్ బాస్మతి బియ్యం ఎగుమతీ ఆగిపోయింది. 4L టన్నుల బియ్యం పోర్టుల్లో నిలిచిపోయింది.

News March 9, 2026

నంద్యాల జిల్లాలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నంద్యాల జిల్లాలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా నంద్యాల, బనగానపల్లెలో 37.1°, చాగలమర్రి 36.3°, ఆళ్లగడ్డ 35°, వెలుగోడు 34° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మార్చిలోనే 37.1°C ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

News March 9, 2026

12న ప్రజా ప్రతినిధులకు అవగాహన: మంచిర్యాల కలెక్టర్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 12 ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.