News September 12, 2025
తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టుబడిన హుండీ దొంగ

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన రూ.4,000 నగదును దొంగిలించాడు. ఈ ఘటనను కమాండ్ & కంట్రోల్ సెంటర్‌లో సీసీటీవీలో గమనించిన అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
Similar News
News September 12, 2025
HYD: ఈ మెట్రో రైలు మాకొద్దు బాబోయ్: L&T

HYDలో లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తున్న మెట్రో రైల్ నిర్వహణ తమకు చేతకావడం లేదని.. ఖర్చులు పెరిగిపోతున్నాయని L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు రూ.5వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని.. రోజూ వచ్చే టికెట్ ఆదాయం సరిపోవడం లేదని.. ఇలా అయితే ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
News September 12, 2025
హన్మకొండ: స్నేహితుడి హత్య కేసులో జీవిత ఖైదు

డబ్బుల విషయంలో స్నేహితుడిని హత్య చేసిన కేసులో నిందితుడు పల్టియా రమేశ్‌కు హన్మకొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి బి.అపర్ణ దేవి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2023 సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘటనలో రమేశ్ తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. కోర్టు రమేశ్‌కి జీవితఖైదుతో పాటు రూ.1000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
News September 12, 2025
HYD: రాష్ట్ర చిహ్నాలతో రాస్తాకు అందం

కూడళ్ల వద్ద ఎక్కువగా మహనీయుల విగ్రహాలే వెలిగిపోతుంటాయి. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌లో ఈ దృశ్యం విభిన్నంగా మెరిసిపోతోంది. TG గౌరవ చిహ్నాలను శిల్పకళాఖండంగా ప్రతిష్ఠించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇరువైపులా TG రాష్ట్ర జంతువులు మచ్చల జింకలు, మధ్యలో రాష్ట్ర పక్షి పాలపిట్ట సోయగం విరజిమ్ముతూ కనువిందు చేస్తోంది. ప్రయాణికుల చూపులను కట్టిపడేస్తోంది. మనసు దోచేస్తోంది.