News September 12, 2025

OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

image

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.

Similar News

News September 12, 2025

టీనేజ్ అమ్మాయిలకు ఈ ఆహారం బెస్ట్

image

టీనేజ్‌ అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించాలంటే వారి డైట్‌లో అవిసె గింజలు చేర్చాలి. ఇందులోని కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, సి, ఇ, కె విటమిన్లు హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయి. రక్తహీనత రాకుండా అంజీర్, శక్తిని పెంచడానికి బీన్స్‌, పప్పులు, చేపలు, నిమ్మజాతి పండ్లు ఇవ్వాలని సూచిస్తున్నారు.

News September 12, 2025

ప్రధాని మోదీ మణిపుర్ పర్యటన ఖరారు

image

PM మోదీ ఈనెల 13 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మిజోరం, మణిపుర్, అస్సాం, వెస్ట్ బెంగాల్‌, బిహార్‌లో 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం రూ.71,850 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బిహార్‌లో మఖానా బోర్డు లాంచ్ చేస్తారు. బిహార్‌లో రూ.36,000 కోట్లు, మిజోరంలో రూ.9,000 కోట్లు, మణిపుర్‌లో రూ.8,500 కోట్లు, అస్సాంలో రూ.18,350 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

News September 12, 2025

మహిళలూ వీటి గురించి తెలుసుకోండి

image

ప్రస్తుతకాలంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరిగింది. వచ్చే జీతం నుంచి సంపదని సృష్టించడం నేర్చుకోవాలి. సిప్, మ్యూచువల్ ఫండ్స్ గురించి బ్యాంకుకు వెళ్లి అడిగితే వాళ్లే వివరాలిస్తారు. గోల్డ్‌ బాండ్స్‌ కొని చూడండి. కొంతకాలానికి వడ్డీ వస్తుంది. ఆరోగ్య, జీవిత బీమాలు తీసుకోండి. భవిష్యత్తుకు తగ్గట్లు ప్రణాళికలు, ఉద్యోగంలో ఎదిగే అవకాశాలు చూడాలి. ప్రస్తుత ఉద్యోగం కాకుండా మరో ఆదాయ వనరు గురించీ ఆలోచించాలి.