News September 12, 2025
సంగారెడ్డి: 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సైన్స్ సెంటర్లో ఈనెల 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సెమినార్‌కు 8 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. క్వాంటమ్ యుగం ప్రారంభం, సంభావ్యతలు, సవాళ్లు అనే అంశంపైన సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 10, 2026
విశాఖలో సెయింట్ గోబైన్ జిప్రాక్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

సెయింట్ గోబైన్‌కు చెందిన జిప్రాక్ విభాగం విశాఖలో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. 2025 డిసెంబరులో ప్రారంభమైన ఈ ఆధునిక కేంద్రం దేశంలోనే తక్కువ కార్బన్ ఉద్గారాలతో పనిచేసే జిప్సం పైకప్పు పలకల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందింది. సంవత్సరానికి సుమారు 50 లక్షల చదరపు మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ పెట్టుబడి భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
News March 10, 2026
అల్లూరి: మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద పద్ధతిపై వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా శిశు సంక్షేమ, సాధికారత అభివృద్ధి అధికారిని ఝాన్సీరామ్ పాడల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల వయస్సు జూలై 2025 నాటికి 42 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ధృవపత్రాలను ఈనెల 10 నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు.
News March 10, 2026
తిరుపతి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష.!

ప్రేమ పేరుతో బాలిక(15)ను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డ చిల్లకూరు(M)పల్లిపేడుకు చెందిన నవీన్‌కు తెలంగాణ రాష్ట్రం హనుమకొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నవీన్ బతువుదెరువు కోసం తెలంగాణకు వలస వెళ్లాడు. అక్కడ 2020లో బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడికి శిక్షతోపాటు ₹14,000 జరిమానా విధించింది.


