News September 12, 2025
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం

TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే ఎస్పీబీ విగ్రహాన్నీ నిర్మించనున్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతికశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తిచేయనున్నారు. కాగా కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.
Similar News
News September 12, 2025
ప్రైవేట్ రంగంలో శాటిలైట్స్ తయారు చేస్తాం: సీఎం

AP: ప్రపంచంలో తెలుగు జాతి నం.1గా ఉండాలనేది తన ఆకాంక్ష అని, అందుకోసం పని చేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఒకటిన్నరేళ్లలో రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో శాటిలైట్స్ తయారు చేస్తాం. ఇందుకోసం స్పేస్ సిటీని తీసుకొస్తున్నాం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. లేపాక్షి దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ తయారు చేస్తాం’ అని Way2News కాన్‌క్లేవ్‌లో వివరించారు.
News September 12, 2025
మంచు బద్రర్స్‌ను ఒక్కటి చేసిన ‘మిరాయ్’!

గత కొంతకాలంగా మంచు బ్రదర్స్ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తేజా సజ్జ హీరోగా మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ ఇవాళ రిలీజవగా మంచు విష్ణు విషెస్ తెలిపారు. దీనికి అనూహ్యంగా మంచు మనోజ్ రిప్లై ఇస్తూ.. ‘ థాంక్యూ సోమచ్ అన్నా. మిరాయ్ జట్టు నుంచి కూడా మీకు థాంక్స్’ అని తెలిపారు. ఇలా ఇద్దరి సంభాషణతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News September 12, 2025
రూ.58 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా AP: CBN

AP: కష్టాల్లోనూ ఈ ఏడాది రాష్ట్రం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని Way2News Conclaveలో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘2024-25లో రూ.15,93,062 కోట్లుగా ఉన్న స్టేట్ GSDP.. 2028-29లో రూ.29,29,402 కోట్లు అవుతుంది. ఆ తదుపరి ఐదేళ్లలో రాష్ట్రం రూ.58 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. 2024-25లో రూ.2,98,058గా ఉన్న ప్రజల సగటు ఆదాయం 2033-34లో రూ.10.55 లక్షలవుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.