News September 12, 2025
పల్నాడులో 14 నెలల విధులు నిర్వహించిన అరుణ్ బాబు

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా 14 నెలల పాటు పనిచేసిన పి. అరుణ్ బాబు బదిలీ అయ్యారు. ఆయన 2024 జులై 7న జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పల్నాడు జిల్లాకు వచ్చారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్‌గా లోతేటి శివశంకర్ పనిచేశారు.
Similar News
News September 12, 2025
జనగామ: యాత్రాదానం బస్సు బహుమతిగా ఇవ్వాలి: కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. “యాత్రాదానం – బస్సును బహుమతిగా ఇవ్వండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు పారదర్శకంగా ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. పథకం అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ప్రయాణికులు, యాత్రీకులు, సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.
News September 12, 2025
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు.
కలెక్టర్ గోడౌన్‌లోని సీల్‌ను, లోపల ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను పరిశీలించారు. ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాలు, స్లాబ్, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ అప్రమత్తతపై ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎన్నికల సామగ్రిని భద్రంగా ఉంచాలని ఆదేశించారు.
News September 12, 2025
అభివృద్ధి కోసమే PPP మోడల్స్: CM చంద్రబాబు

AP: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరముందని CM చంద్రబాబు Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘అభివృద్ధి కోసమే PPP మోడల్స్ అనుసరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయి. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పథకాలు అమలు చేసే శక్తి వస్తుంది. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం’ అని తెలిపారు.