News September 12, 2025
మావోయిస్టు మృతితో మడికొండలో విషాద ఛాయలు..!

హనుమకొండ జిల్లా మడికొండలో మావోయిస్టు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. మడికొండ వాస్తవ్యుడైన కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), సెంట్రల్ రీజినల్ బ్యూరో మెంబర్ (CRBM), ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ(60) అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రాజేష్ అలియాస్ రామచందర్ అలియాస్ రాజేంద్ర మరణించినట్టుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు.
Similar News
News March 10, 2026
VKB: ఇంటర్ పరీక్షకు 170 మంది విద్యార్థులు గైర్హాజరు

వికారాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 170 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మొత్తం 7,072 మంది విద్యార్థులకు గాను 6,902 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో 5,693 మందికి 5,568 మంది హాజరు కాగా 125 మంది గైరాజరు. ఒకేషనల్ విభాగంలో 1,379 మందికి 1,334 మంది హాజరయ్యారు (45 మంది గైరాజరు). పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వెల్లడించారు.
News March 10, 2026
కొరత లేదు.. LPG ఉత్పత్తి 10% పెంపు

దేశంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. ఆయిల్ కంపెనీలు 10% LPG ఉత్పత్తిని పెంచాయని, అన్ని కంపెనీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొంది. కృత్రిమ కొరత నివారణపై కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచినట్లు ప్రకటించింది.
News March 10, 2026
హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.


