News September 12, 2025
HYD: వీధిలో చెత్త వేస్తున్నారా..? ALERT

HYD వీధులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంతో తలెత్తే సమస్యలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా రెండు రోడ్లు, ప్రార్థన స్థలాలు ఉన్నచోట్ల ఈ చర్యలు చేపడుతున్నారు. చెత్త వేస్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ విధానం ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో అమలు చేస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.
Similar News
News March 22, 2026
తిరుపతి కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో పాటు పాత రసీదులు తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదుల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు
News March 22, 2026
BREAKING: అనంతపురంలో పెట్రోల్ పోస్తుండగా మంటలు

గుమ్మఘట్ట (M) గోనబావిలో పెట్రోలు మండి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. గ్రామంలో చిల్లర కొట్టు, హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు, భార్య, కూతురు దుకాణంలో ఉండగా ఆదివారం పెట్రోలును ఒక బాటిల్ నుంచి మరో బాటిల్‌లోకి మారుస్తున్నారు. వారి సమీపంలో వెలుగుతున్న గ్యాస్ స్టవ్ ఉండటంతో పెట్రోలు మండి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.
News March 22, 2026
పాలమూరు: జిల్లాకు ప్రాణధారలు కృష్ణ, దుందుభి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణ, దుందుభి నదులు వ్యవసాయానికి ఊపిరిపోస్తున్నాయి. జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. నేడు ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, ఈ జీవనదులను కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.


