News September 12, 2025
మేం బీఆర్ఎస్‌లోనే ఉన్నాం: ఎమ్మెల్యేలు

TG: కాంగ్రెస్‌లో చేరిన తమ 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న BRS పిటిషన్‌పై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని SC ఆదేశించిన విషయం తెలిసిందే. స్పీకర్ వారి నుంచి వివరణ కోరగా ‘మేము BRSలోనే ఉన్నాం. పార్టీ మారలేదు. అభివృద్ధి పనుల కోసమే CMను కలిశాం’ అని కృష్ణమోహన్, అరెకపూడి, సంజయ్, మహిపాల్ రెడ్డి, పోచారం, ప్రకాశ్ గౌడ్, యాదయ్య, వెంకట్రావు చెప్పినట్లు సమాచారం. అయితే కడియం, దానం మరింత సమయం కోరారు.
Similar News
News March 14, 2026
విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.
News March 14, 2026
అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 150 ఉద్యోగాలు

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండి, 21-38 ఏళ్ల మధ్య వయసు వారు అప్లై చేయొచ్చు. జీతం రూ.18,730- రూ.68,040 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ MAR 20 నుంచి ప్రారంభం. చివరి తేదీ APR-19. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు acab.bank.in చూడండి.
News March 14, 2026
వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

TG: మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా చేపడుతోన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారం రోజుల్లో శంకుస్థాపన జరగనుంది. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో దీనిపై చర్చించి ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మూసీ ఒడ్డున ఉన్న 800ఏళ్ల నాటి శివాలయాన్నీ పునరుద్ధరించనుంది. ఉస్మానియా ఆస్పత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మించనుంది. ఓ భారీ మసీదును నిర్మించేందుకు సౌదీ యువరాజు ముందుకొచ్చినట్లు సమాచారం.


