News September 12, 2025

వరంగల్: పంచాయతీ కార్యదర్శులకు తప్పని నిరీక్షణ..!

image

పంచాయతీ కార్యదర్శులకు ఇంకొన్నాళ్లు నిరీక్షణ తప్పేలా లేదు. గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో పలు అభివృద్ధి, మరమ్మతు పనులకు కార్యదర్శులు సొంతంగా జేబులోంచి డబ్బులు పెట్టి పనులు చేయిస్తున్నారు. కాగా, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా భారంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచులు వస్తే పనులను పాలకవర్గాలు చేపడుతాయి. కానీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

Similar News

News March 15, 2026

KTDM: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కూతురు చెప్పడంతో వీడిన మిస్టరీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో ఎస్‌డీ జాఫర్ హత్య కలకలం రేపింది. భార్య ఖతీజా ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మద్యం తాగడంతో చనిపోయాడని, సహజ మరణంగా చిత్రీకరించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కుమార్తె చెప్పిన వివరాలతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2026

మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

image

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.

News March 15, 2026

KMR: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని, అందిన అర్జీలను అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదికను వాడుకోవాలని సూచించారు.