News April 4, 2024

కడప జిల్లాలో బెంబేలెత్తిస్తున్న భానుడు

image

జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం రాష్ర్టంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండ ప్రభావానికి వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరించారు.

Similar News

News October 6, 2024

కడప నగరంలో కారు బోల్తా

image

బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.

News October 6, 2024

YVU: సెలవులున్నా.. పరీక్షలు యథాతథం

image

కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్‌ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

News October 5, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల రాచమల్లు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.