News September 12, 2025
భారీ వర్షాలు.. వికారాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. కోట్‌పల్లి మండలంలోని నాగసామందర్ వాగు పొంగడంతో DSP శ్రీనివాస్ రెడ్డి, ధరూర్ సీఐ రఘురామ్, SI రాఘవేందర్‌తో కలిసి వాగును సందర్శించారు. వాగులో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 5, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

☞ఎచ్చెర్ల: వర్సిటీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం
☞శ్రీకాకుళం: మహిళ భద్రతకు ప్రాధాన్యత
☞ఈనెల 9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ స్పర్శ
☞నరసన్నపేట: శవ గదికెళ్లాలంటే పరీక్షే
☞శ్రీకాకుళంలో మర్డర్..నిందితుడి అరెస్ట్
☞అచ్చెన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలి: పేరాడ తిలక్
☞SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు
☞కరగాం: గుండెపోటుతో యువ ఇంజినీర్ మృతి
News March 5, 2026
నస్రుల్లాబాద్: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన చిన్న మొగులయ్య ఈ నెల 4న రాత్రి ఇంట్లో రొట్టె ముక్కలు తిని, గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బయటకు వచ్చి రోడ్డుపై పడి మృతి చెందాడు. రొట్టె ముక్క వలన..? ఇతర కారణాల అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశామని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 5, 2026
NZB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు: డీఎంహెచ్‌వో

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెల లోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు.


