News September 12, 2025
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని తాగునీటి ట్యాంక్‌లను వారానికి ఒకసారి శుభ్రపరచాలన్నారు.
Similar News
News March 17, 2026
సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 17, 2026
NTR: బీ.టెక్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో డిసెంబర్ 2025లో నిర్వహించిన III/IV బీ.టెక్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.


