News April 4, 2024
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ గుడ్ బై?

ఐపీఎల్-2024 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారట. హార్దిక్ కెప్టెన్సీపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నారని ఓ MI ప్లేయర్ చెప్పినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న మెగా ఆక్షన్‌లో హిట్‌మ్యాన్ పాల్గొంటారని తెలిపాయి. 5 ట్రోఫీలు అందించిన రోహిత్‌ను కాదని పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడం పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 23, 2026
రాజధాని డిజైన్లకే రూ.401 కోట్లా: YCP

AP: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాల డిజైన్ల పేరిట CBN, ఆయన బినామీలు రూ.కోట్లు కొట్టేస్తున్నారని YCP ఆరోపించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి డిజైన్లు గీసి ఇవ్వడానికే దాదాపు రూ.401 CR ఖర్చు పెడుతున్నారని పేర్కొంది. 2016లో ఓ జపాన్ సంస్థకు, 2017లో జెనిసిస్ ప్లానర్స్‌కు రూ.113CRకు కాంట్రాక్టు ఇచ్చి రద్దు చేశారని తెలిపింది. 2024లో మళ్లీ జెనిసిస్‌కు రూ.137CRకు కాంట్రాక్టు ఇచ్చారని విమర్శించింది.
News March 23, 2026
‘ధురంధర్-2’: 4 రోజుల్లోనే రూ.761కోట్లు

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్- 2’ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.761కోట్లు(గ్రాస్) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇండియాలోనే రూ.550కోట్లు రావడం విశేషం. తొలి 2,3 రోజులతో పోల్చితే నాలుగో రోజు(ఆదివారం) భారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వీకెండ్‌లోపు రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.
News March 23, 2026
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: రేవంత్

TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. వారికి మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తామన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని వారికి సూచించారు.


