News September 12, 2025
గట్టు: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..!

గట్టు మండలం ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్ శుక్రవారం గట్టు సల్కాపురం గ్రామాల మధ్య పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యాన్‌లో 20 మంది విద్యార్థులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వ్యాన్ వరి పొలంలో కూరుకుపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు అంటున్నారు.
Similar News
News September 12, 2025
GNT: పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శుక్రవారం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఎమ్మెస్సీ సోషల్ సైన్స్ & అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ సైకాలజీ తదితర కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్‌కు ఆసక్తి ఉన్నవారు రూ.1860 ఫీజు చెల్లించి, ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News September 12, 2025
దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే: చంద్రబాబు

AP: 2028 నాటికి తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తవుతుందని చంద్రబాబు Way2News కాన్‌క్లేవ్‌లో అన్నారు. ‘పేదలను నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేను 45 ఏళ్లుగా కష్టపడుతున్నాను. దేశంలో సీనియర్ మోస్ట్ లీడర్ నేనే. దేశం ముందుకెళ్లడానికి ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి. సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారంటే అది మోదీ గారే. తెలుగుజాతి అన్నింటిలో నంబర్ వన్‌గా ఉండాలన్నదే నా ఆకాంక్ష’ అని వ్యాఖ్యానించారు.
News September 12, 2025
తూ.గో: 91 మందిపై కేసులు నమోదు

ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళ్లల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 577 వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 91 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటు 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 171 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.