News September 12, 2025
HYD: వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్‌లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News September 12, 2025
రేవులపల్లి-నందిమల్ల మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి..!

ధరూర్ మండలం రేవులపల్లి, నందిమల్ల మధ్య జూరాల ప్రాజెక్ట్ దిగువన హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ కోరింది. బుధవారం కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. రేవులపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించినప్పటికీ.. ఇటీవల కొత్తపల్లి-జూరాల మధ్య నిర్మించే యత్నం చేస్తున్నారని దానిని విరమించుకోవాలన్నారు.
News September 12, 2025
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి, గాంధీనగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను రక్షించడానికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.
News September 12, 2025
MNCL: తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీలో చేరిక

తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీలో శుక్రవారం పలువురు చేరారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి బీసీ జేఏసీ జిల్లా ఇన్‌ఛార్జ్ మహేష్ వర్మ కండువా కప్పి ఆహ్వానించారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రానున్న బీసీ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల కీలక నాయకులు సిద్ధంగా ఉన్నారని మహేష్ తెలిపారు. ఈ నెల 17న బీసీల పార్టీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు.