News September 12, 2025
నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్?

ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కానున్నారు.
Similar News
News September 12, 2025
రాజకీయాల్లో యువతకు అవకాశం: MP భరత్

యువత రాజకీయాల్లోకి రావాలని Way2News కాన్‌క్లేవ్‌లో MP భరత్ పిలుపునిచ్చారు. ‘7 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. మా పార్లమెంట్ నియోజకవర్గంలోనే 10 వార్డుల్లో క్వాలిటీ లీడర్‌షిప్ లేదని నా అభిప్రాయం. ఆ స్థానాల్లో యువకులకు ఓపెన్ కాల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కార్పొరేటర్ ఎలక్షన్స్‌కి ఐదారుగురు యువకులను రాజకీయాల్లోకి తీసుకురాగలిగితే వాళ్లే భవిష్యత్‌లో MLA క్యాండిడేట్స్ అవుతారు’ అని తెలిపారు.
News September 12, 2025
నన్ను పెళ్లి చేసుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరో: తమన్నా

తాను మంచి పార్ట్‌నర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని తమన్నా అన్నారు. ‘Do You Wanna Partner’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తమన్నా లాంటి భార్య దొరికింది అనుకోవాలి. ఆ లక్కీ పర్సన్ ఎవరో నాకు తెలియదు. త్వరలో మీరు అతడిని చూస్తారేమో’ అని కామెంట్స్ చేశారు. కాగా విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా మళ్లీ లవ్‌లో పడిందేమోనని ఫ్యాన్స్ అంటున్నారు.
News September 12, 2025
Way2News ఉత్తరాదిలోనూ రాణించాలి: చంద్రబాబు

డిజిటల్ మీడియా రంగంలో వే2న్యూస్ జాతీయ స్థాయిలో రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘వే2న్యూస్ ఓ స్టార్టప్ కంపెనీ. నాలెడ్జ్ ఎకానమీలో 19 ఏళ్ల క్రితమే ఫౌండర్ రాజు వనపాల వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో వే2న్యూస్ రాణిస్తోంది. ఉత్తర భారతదేశంలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని Way2News కాన్‌క్లేవ్‌లో సీఎం అన్నారు.