News September 12, 2025

సత్యనారాయణపురంలో గుర్తు తెలియని మృతదేహం

image

దెందులూరు మండలం సత్యనారాయణపురంలోని గోదావరి కాలువలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. చేతిపై ‘సత్య’ అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు దెందులూరు పోలీసులను సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరారు.

Similar News

News March 18, 2026

పార్లమెంట్‌లో అమరావతి కళాఖండాల అంశం

image

ప్రాచీన అమరావతి నాగరికత, ఆచార్య నాగార్జునుడికి చెందిన ఎన్నో కళాఖండాలు విదేశీ మ్యూజియంలలో ఉన్నాయి. లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఇవి కొలువు దీరాయి. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి వీటిని అక్కడికి తరలించారు. ఈ కళాఖండాలను వెనక్కి రప్పించే అంశం తాజాగా పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికే 600కు పైగా కళాఖండాలను భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. మిగతా వాటిని కూడా రప్పించనున్నారు.

News March 18, 2026

కడప: రైతులకు చెల్లించాల్సింది ఎంతో.. చెళ్లించింది కొంతే.!

image

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.

News March 18, 2026

చిత్తూరు: 21న స్థాయి సంఘాల సమావేశం

image

జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాన్ని ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జడ్పీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1 నుంచి 7 స్థాయీ సంఘాలతో ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు.