News September 12, 2025
రాజధాని కేంద్రంగా అమరావతి జిల్లా..?

పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ రాజధాని కేంద్రంగా అమరావతి జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, ధ్యాన బుద్ధ, పులిచింతల ప్రాజెక్టులు కొత్త జిల్లాలోకి మారనున్నట్లు సమాచారం. దీని కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా సరిహద్దుల మార్పునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Similar News
News March 22, 2026
ఆదిలాబాద్: గడప దాటితే నీటి యుద్ధమే

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి సమస్య కేవలం ఒక వార్తాంశం కాదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అక్కడి ప్రజల ప్రతిరోజూ సాగే కన్నీటి పోరాటం. ఎండ వేడిమి పెరిగే కొద్దీ, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నీటి చుక్క కోసం పడే ఆరాటం వర్ణనాతీతం. మారుమూల గ్రామాల్లో గడప దాటగానే మొదలయ్యే నీటి వేట, వారి కష్టాలను ప్రతిబింబిస్తోంది. దీంతో ఎండాకాలంలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మేలు.
News March 22, 2026
అనకాపల్లి : సీఎం చంద్రబాబు సభకు 400 బస్సులు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలో అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు 400 బస్సులను కేటాయించారు. ఒక్కొక్క బస్సులో 60 మందిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. వీరందరికి బస్సు ఎక్కేముందు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తామన్నారు. తిరిగి ప్రయాణంలో కూడా ఫుడ్ సరఫరా చేస్తామన్నారు. బస్సులు సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతాయి.
News March 22, 2026
కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.


