News September 12, 2025

ఇందిరమ్మ ఇండ్ల ఫిర్యాదు కోసం కాల్ సెంటర్: జనగామ కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు, అలాగే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న 1800 599 5991 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. కాగా జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.

Similar News

News September 12, 2025

రాజకీయాల్లో యువతకు అవకాశం: MP భరత్

image

యువత రాజకీయాల్లోకి రావాలని Way2News కాన్‌క్లేవ్‌లో MP భరత్ పిలుపునిచ్చారు. ‘7 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. మా పార్లమెంట్ నియోజకవర్గంలోనే 10 వార్డుల్లో క్వాలిటీ లీడర్‌షిప్ లేదని నా అభిప్రాయం. ఆ స్థానాల్లో యువకులకు ఓపెన్ కాల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కార్పొరేటర్ ఎలక్షన్స్‌కి ఐదారుగురు యువకులను రాజకీయాల్లోకి తీసుకురాగలిగితే వాళ్లే భవిష్యత్‌లో MLA క్యాండిడేట్స్ అవుతారు’ అని తెలిపారు.

News September 12, 2025

అల్లీపూర్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సీఈఓ గౌతమ్ తనిఖీ

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం మండల స్పెషల్ ఆఫీసర్/సీఈఓ బి.గౌతమ్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంట గది పరిశుభ్రత కాపాడుతూ రిజిస్టర్లను సమయానుసారం అప్‌డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పీఆర్ ఏఈ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 12, 2025

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

RGM నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు ఆలస్యమైతే ఖర్చులు పెరిగి భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. GP భవనాలు, అంగన్వాడీలు, శానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, పాఠశాల టాయిలెట్స్, R&B రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.