News September 12, 2025
తాండూరు: సంగెంకలాన్ వాగులో గల్లంతు.. శవమై లభ్యం

తాండూరు మండలం సంగెంకలాన్ వాగులో కొట్టుకుపోయిన మొగులప్ప మృతదేహం లభ్యమైంది. వరద ఉద్ధృతి తగ్గడంతో శుక్రవారం ఉదయం గ్రామస్థులు గాలింపు చేపట్టగా, సంగెంకలాన్-చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం మార్గంలో ఓ చెట్టుకు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికితీశారు.
Similar News
News September 12, 2025
రాజకీయాల్లో యువతకు అవకాశం: MP భరత్

యువత రాజకీయాల్లోకి రావాలని Way2News కాన్‌క్లేవ్‌లో MP భరత్ పిలుపునిచ్చారు. ‘7 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయి. మా పార్లమెంట్ నియోజకవర్గంలోనే 10 వార్డుల్లో క్వాలిటీ లీడర్‌షిప్ లేదని నా అభిప్రాయం. ఆ స్థానాల్లో యువకులకు ఓపెన్ కాల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కార్పొరేటర్ ఎలక్షన్స్‌కి ఐదారుగురు యువకులను రాజకీయాల్లోకి తీసుకురాగలిగితే వాళ్లే భవిష్యత్‌లో MLA క్యాండిడేట్స్ అవుతారు’ అని తెలిపారు.
News September 12, 2025
అల్లీపూర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సీఈఓ గౌతమ్ తనిఖీ

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం మండల స్పెషల్ ఆఫీసర్/సీఈఓ బి.గౌతమ్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంట గది పరిశుభ్రత కాపాడుతూ రిజిస్టర్లను సమయానుసారం అప్‌డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పీఆర్ ఏఈ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News September 12, 2025
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

RGM నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, పనులు ఆలస్యమైతే ఖర్చులు పెరిగి భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. GP భవనాలు, అంగన్వాడీలు, శానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, పాఠశాల టాయిలెట్స్, R&B రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.