News September 12, 2025
HYD: ఎమ్మెల్యేల వివరణను బీఆర్ఎస్‌కు పంపిన స్పీకర్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యే వివరణలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి పంపించారు. ‘తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. వారి సమాధానం మీకు పంపుతున్నాం. మీరు మీ అభ్యంతరం, అభిప్రాయం చెప్పాలి’ అని స్పీకర్ కోరారు. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. దీంతో ఈనెల 13లోగా స్పీకర్‌కు వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
Similar News
News September 12, 2025
ASF: ‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావ్, పోలీస్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
News September 12, 2025
MBNR: ‘ఉర్దూ ఘర్’ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ నాయకుల డిమాండ్

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.
News September 12, 2025
ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం

33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ములుగు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈ నాగేశ్వర్ రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ములుగు, ఏటూరునాగారం, మంగపేటతో సహా పలు సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా ఉండదని ఆయన వివరించారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.