News September 12, 2025
మంచి భార్య అనిపించుకోవాలని..!

మంచి కోడలు, మంచి భార్య అనిపించుకోవాలని మహిళలు అత్తింట్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. దాన్నే గుడ్‌వైఫ్ సిండ్రోం అంటారు. ప్రతి చిన్నవిషయానికీ సర్దుకుపోవడం, సంతోషాలు వదులుకోవడం దీని లక్షణాలు. కుటుంబం కోసం తమ ఫీలింగ్స్ తొక్కిపెట్టేస్తారు. దీంతో దీర్ఘకాలంలో డిప్రెషన్‌కు గురవుతారని నిపుణులు అంటున్నారు. ఇలాకాకుండా అర్థం చేసుకొనే భాగస్వామిని ఎంచుకొని స్వేచ్ఛగా, సంతోషంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News September 12, 2025
రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

AP: యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని 1.43 కోట్ల BPL కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. APL (Above poverty line) ఫ్యామిలీలకు రూ.2.50 లక్షల వరకు ఫ్రీ వైద్యం అందుతుందన్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ముందే ప్రీమియం చెల్లిస్తుందని, నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యసేవలను నిలిపివేసే అవకాశం ఉండదని Way2News కాన్‌క్లేవ్‌లో వివరించారు.
News September 12, 2025
సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

TG: రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15 నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ఇవాళ ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తోంది. సానుకూల నిర్ణయం రాకపోతే కాలేజీలు మూతబడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీలు సైతం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
News September 12, 2025
YCP వల్లే వైద్య కళాశాలల్లో ఈ దుస్థితి: అనిత

AP: PPP వల్ల ఏ ఒక్క సీటూ పేదలకు దక్కకుండా పోదని హోంమంత్రి అనిత భరోసానిచ్చారు. ‘గత ఐదేళ్లు YCP చేసిన పాపాల వల్లే వైద్య కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ ఇవ్వలేకపోయాం. మెడికల్ కాలేజీల భవనాల్లో 47 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ లేదని అడ్మిషన్ ఇవ్వలేమని నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ ఇచ్చింది. మెడికల్ కాలేజీలకు ఇవ్వాల్సిన సొమ్మును వేరే వాటికి ఉపయోగించుకున్నారు’ అని తెలిపారు.