News September 12, 2025

HYD: నేడే Ed.CET సెకండ్ ఫేజ్ రిజల్ట్స్

image

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నేడు సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీటు పొందిన కాలేజీల వారిగా ఫలితాలు విడుదల చేస్తామని, విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 12, 2025

నేరాల్లో ‘అగ్రరాజ్యం’

image

వరుస నేరాలతో అగ్రరాజ్యం అమెరికా ప్రతిష్ఠ మసకబారుతోంది. గత కొంత కాలంగా అక్కడ క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం <<17637268>>ఉక్రెయిన్ శరణార్థి<<>> బస్సులో హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం ట్రంప్ <<17674039>>సన్నిహితుడినే<<>> బహిరంగంగా కాల్చి చంపారు. నిన్న ఏకంగా భారతీయుడి <<17684402>>తల నరికేశారు<<>>. దీంతో అక్కడున్న భారతీయులు, ఇండియాలో ఉన్న వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

News September 12, 2025

వట్లూరు రైల్వే ట్రాక్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

వట్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు వట్లూరు రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పక్కన కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం దొరికింది. ఆరంజ్ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తి వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలు తెలిసినవారు రైల్వే HC ప్రసాద్‌ను సంప్రదించాలని సూచించారు.

News September 12, 2025

నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.