News September 12, 2025
HYD: నేడే Ed.CET సెకండ్ ఫేజ్ రిజల్ట్స్

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నేడు సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీటు పొందిన కాలేజీల వారిగా ఫలితాలు విడుదల చేస్తామని, విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
Similar News
News September 12, 2025
HYD- గోవాకు ఎగిరిపోదాం పదా బ్రో

పర్యాటక ప్రేమికుల కోసం IRCTC కొత్త ఎయిర్ ప్యాకేజీలు ప్రకటించింది. HYD నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణికులను తీసుకెళ్లనుంది. 4, 5, 6, 8 రోజుల ప్యాకేజీలు తీసుకొచ్చింది. గోవా, గుజరాత్, కశ్మీర్, మేఘాలయ, కర్ణాకట, అండమాన్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలను చూపించనుంది. వీటితోపాటు థాయిలాండ్, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. వివరాలకు 040-27702407, 9701360701 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
News September 12, 2025
రింగ్ రైల్‌తో మారనున్న HYD రూపురేఖలు

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?
News September 12, 2025
HYD: LIC ఉద్యోగికి నరకం చూపిస్తున్న సైబర్ నేరగాళ్లు

HYDలో ఓ LIC ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు నరకం చూపించారు. బ్యాంక్ డిటైల్స్ ఇవ్వాలంటూ ఫోన్‌లో ఒత్తిడి చేశారు. అడల్ట్ వీడియోలు వైరల్ చేసినందుకు నీపై కేసులు నమోదయ్యాయని బెదిరించారు. అడిగిన వివరాలు ఇవ్వకపోతే మధ్యాహ్నం లోగా అరెస్ట్ చేస్తామని బెదిరరించారు. పోలీసులమంటూ LIC ఉద్యోగితో వీడియో కాల్‌లోనూ సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. 4 రోజులుగా సైబర్ నేరగాళ్ల వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోయారు.