News September 12, 2025
పాతబస్తీ మెట్రో.. రూ.433 కోట్ల పరిహారం విడుదల

పాతబస్తీ మెట్రో పనులపై MD NVS రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. భవన కూల్చివేత సాగుతుండగా రూ.433 కోట్ల పరిహారం విడుదల చేశారు. ప్రత్యేక నోటీసులో అధికారులు వివరాలు తెలిపారు. ఇప్పటివరకు పాతబస్తీ మెట్రో రూట్‌లో దాదాపు 550 భవనాల కూల్చివేత పూర్తయినట్లు వెల్లడించారు.
Similar News
News September 12, 2025
రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.
News September 12, 2025
రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.
News September 12, 2025
రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈఓ

గత నెల 18న వర్షాల కారణంగా ప్రకటించిన సెలవుకు బదులుగా ఈ నెల 13వ తేదీన (రెండో శనివారం) పాఠశాలలు తెరిచి ఉంటాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించినట్లు డీఈఓ రమేశ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓలకు, ఎంఈఓలకు ఆదేశాలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.