News September 12, 2025
ఆ పెట్టుబడి చిట్కాలు నమ్మొద్దు: వరంగల్ సైబర్ పోలీసులు

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలు నమ్మి మోసపోవద్దని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అవి పెట్టుబడి చిట్కాలు కావని, సైబర్ వలలని గుర్తించాలని సూచించారు. కొద్ది రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయన్న అత్యాశతో మోసపోవద్దని, సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి, ఆచితూచి అడుగు వేయాలని సూచించారు.
Similar News
News September 12, 2025
వట్లూరు రైల్వే ట్రాక్ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతి

వట్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు వట్లూరు రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పక్కన కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం దొరికింది. ఆరంజ్ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తి వయసు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలు తెలిసినవారు రైల్వే HC ప్రసాద్‌ను సంప్రదించాలని సూచించారు.
News September 12, 2025
నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.
News September 12, 2025
రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.