News September 12, 2025
జనగామ జిల్లా వ్యాప్తంగా 53.9 మి.మీ వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 53.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరిగొప్పుల 55.8, చిల్పూర్ 68.6, జఫర్‌గఢ్ 36.8, స్టేషన్ ఘనపూర్ 74.4, రఘునాథపల్లి 94.2, నర్మెట్ట 19.2, బచ్చన్నపేట 119.6, జనగామ 68.4, లింగాల ఘనపూర్ 74.2, దేవరుప్పుల 11.4, పాలకుర్తి 21.2, కొడకండ్ల 2.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
Similar News
News September 12, 2025
వనపర్తి: యూరియా వాడకంపై డీఏఓ సూచన

వరి పంటకు మోతాదుకు మించి యూరియా వాడితే చీడపీడలు ఎక్కువగా వస్తాయని వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి అంజనేయులు గౌడ్ అన్నారు. యూరియా సరఫరా నిరంతర ప్రక్రియ కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యూరియా వినియోగం గణనీయంగా పెరిగిందని, గత ఏడాది 12,899 మెట్రిక్ టన్నులు వాడితే, ఈ ఏడాది 18,685 మెట్రిక్ టన్నుల యూరియాను వాడినట్లు తెలిపారు.
News September 12, 2025
అధిక ధరకు యూరియా విక్రయిస్తే చర్యలు: ఎస్పీ

యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీపై సరఫరా అవుతున్న యూరియాను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News September 12, 2025
గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాంతంగా తిరుపతి: కలెక్టర్

టూరిజంపై పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో పెళ్లి చేసుకోడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారని, తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాంతంగా అభివృద్ధి చేసేలా టూరిజం,TTD చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.